![]() |
![]() |

నిజానికి పెళ్లి ఒక పెద్ద కమిట్మెంట్. ఈ జెనెరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడడమే లేదు. ఇండిపెండెంట్ గా ఉంటాం అంటూ ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఈ వారం ఫ్యామిలీ స్టార్స్ లో కూడా ఈ పెళ్లి అనే టాపిక్ మీద ఈ షోకి వచ్చిన స్టార్స్ అంతా మాట్లాడారు. "అసలు పెళ్లి ఎందుకు వద్దో ఒక రీజన్ చెప్పండి" అని సుధీర్ అడిగాడు. "పెళ్లి అనేది ఒక పెద్ద కమిట్మెంట్ చాలా బాధ్యతలు ఉంటాయి. స్వేచ్ఛ ఉండదు. ఆ బాధ్యతలను నెరవేర్చడంలోనే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడంలోనే లైఫ్ సర్వనాశనం ఐపోతుంది" అంటూ నటి హేమ చెప్పింది.
.webp)
ఇక బుల్లితెర నటి జ్యోతి మాట్లాడుతూ "పెళ్లి అనేది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఇప్పుడు ఉన్న జెనెరేషన్ కి ఇది సెట్ కాదు. ప్రతీ ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఇండిపెండెంట్ గా ఉండడానికి అలవాటైపోయారు. ఎవరి సెల్ఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. పెళ్లి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎంత వరకు ఇవ్వగలుగుతారు అనేది గ్యారెంటీ లేదు. అందుకే పెళ్లి వద్దు అనుకోవడమే బెటర్" అని చెప్పింది. ఇక ఆకర్ష్ బైరాముడి మాట్లాడుతూ "పెళ్లి ఎందుకు వద్దు అంటే మీ ఇంటికి మీరే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరు పెళ్లి ఎందుకు వద్దు అనే టాపిక్ మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు.
![]() |
![]() |